యూ.ఏ.ఈ:భారత పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్ కోసం ఆన్ లైన్ బుకింగ్స్
- June 19, 2020
యూఏఈలోని భారత పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్ కోసం ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది BLS ఇంటర్నేషనల్ సంస్థ. యూఏఈలోని పాస్ పోర్ట్, వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ సేవలను ఔట్ సోర్సింగ్ సంస్థ BLS ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే..లాక్ డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరణ కావటంతో బీఎల్ఎస్ సేవా కేంద్రాలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. గత వారం కూడా సేవా కేంద్రాలకు భారీ సంఖ్యలో వచ్చిన జనం..భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో అపాయింట్మెంట్ లను ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంతో అపాయింట్మెంట్ పొందిన వారు నిర్ణీత సంఖ్యలో మాత్రమే సేవా కేంద్రాలకు రావటం ద్వారా భౌతిక దూరం పాటించేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 15 నుంచే ఈ ఆన్ లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. http://www.blsindiavisa-uae.com వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అపాయింట్ మెంట్ బుక్ చెయ్యలేని భారతీయ కార్మికులకు సహాయం చేయడానికి టోకెన్లను ఉపయోగించి వాక్-ఇన్ కస్టమర్ల కోసం BLS కేంద్రాలు కొన్ని స్లాట్‌లను అందిస్తూనే ఉంటాయని కాన్సులేట్ అధికారి స్పష్టం చేశారు. పరిస్థితి సాధారణం అయ్యే వరకు మరియు ప్రజలు ఆన్‌లైన్ వ్యవస్థకు అలవాటు పడతారని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







