హెల్త్‌ ప్రొసిడ్యూర్స్‌ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు

- June 19, 2020 , by Maagulf
హెల్త్‌ ప్రొసిడ్యూర్స్‌ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు

మనామా: పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ నుంచి హెల్త్‌ రెగ్యులేషన్స్‌కి సంబంధించి పెద్దయెత్తున నోటిఫికేషన్స్‌ అందుకుంటోంది. 23 మంది ఉల్లంఘనలకు పాల్పడటంపై ఈ నోటిఫికేషన్స్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అందాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని అమలు చేయాల్సి వుండగా, వాటిని ఉల్లంఘిస్తున్నట్లు సదరు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. కాగా, హోం క్వారంటైన్‌ ఉల్లంఘనలకు సంబంధించి కూడా 14 మంది వ్యక్తులపై ఫిర్యాదులు అందుకుంది పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌. వెంటనే పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారణను ప్రారంభించింది. కాగా, లోయర్ క్రిమినల్‌ కోర్ట్‌ 9 మంది నిందితులకు ఒక్కొక్కరికి 1000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com