కల్నల్ సంతోష్‌బాబుకు నివాళులర్పించిన హీరో విష్వక్ సేన్
- June 21, 2020సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన పోరులో అసులువు బాసి నేషనల్ హీరోగా నిలిచిన వీరసైనికుడు కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని 'హిట్' సినిమా హీరో విష్వక్ సేన్ పరామర్శించారు. శనివారం విష్వక్ సేన్ సూర్యాపేటకు వెళ్లి, సంతోష్‌బాబుకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్‌బాబు వంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా విష్వక్ సేన్ మాట్లాడుతూ, "ఈ కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కళ్ల కోసం కాదు, మన రాష్ట్రం కోసం కాదు, మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి, మన సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. కుమారుడిని కోల్పోయిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకున్నా కూడా నా హృదయం తల్లడిల్లుతోంది. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్" అన్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు