నేటి నుంచి కర్ఫ్యూ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- June 21, 2020
రియాద్:మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో 3 నెలల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా.. నేటి నుంచి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇవాళ్టితోనే యధావిధిగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే కర్ఫ్యూ ఆంక్షలు తొలిగిస్తున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కానీ... మతపరమైన తీర్థయాత్రలు, అంతర్జాతీయ ప్రయాణాలు, సామాజిక సమావేశాలు(50 మందికి మించకుండా) తదితర అంశాలపై ఆంక్షలు అలాగే కొనసాగుతాయని చెప్పింది.
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ మార్చిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొన్ని నగరాలు, పట్టణాల్లో ఏకంగా 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది కూడా. ఇక మేలో మూడు దశల్లో కర్ఫ్యూ ఆంక్షలను తొలగించనున్నట్లు ప్రకటించిన సౌదీ... జూన్ 21తో పూర్తిగా కర్ఫ్యూను తొలగించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?