తాజాగా 'కుంగ్ ఫ్లూ': ట్రంప్

- June 21, 2020 , by Maagulf
తాజాగా \'కుంగ్ ఫ్లూ\': ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి చైనాపై విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. కరోనా వైరస్ ప్రపంచం మొత్తం చుట్టేయడానికి చైనానే కారణమని మొదటి నుంచీ ఆరోపిస్తున్న ట్రంప్.. కరోనా వైరస్‌ను 'కుంగ్ ఫ్లూ'గా అభివర్ణించారు.

ఒక్లహామాలోని టుల్సాలో శనివారం తొలి ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో మరే వ్యాధికీ లేనన్ని పేర్లు కోవిడ్-19కు ఉన్నాయన్నారు. ''నేను దానిని 'కుంగ్ ఫ్లూ' అంటాను. నేను దానికి 19 వేర్వేరు పేర్లు పెట్టగలను. చాలా మంది దానిని వైరస్ అంటున్నారు. మరికొందరు ఫ్లూ అంటున్నారు. తేడా ఏంటి? నేనైతే 19, 20 రకాల పేర్లు ఉన్నాయని అనుకుంటున్నాను'' అని ట్రంప్ పేర్కొన్నారు.

చైనా మార్షల్ ఆర్ట్స్ 'కుంగ్ ఫూ'ను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ 'కుంగ్ ఫ్లూ' అని పేర్కొనడం గమనార్హం. కాగా, ట్రంప్ గతంలో కరోనా వైరస్‌ను 'చైనీస్ వైరస్' అని కూడా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com