తెలంగాణలో కొత్తగా 872 కరోనా కేసులు

- June 22, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 872 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 4,005 మంది డిశ్చార్జి అయ్యారు. నేడు కరోనాతో మరో 7 మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 713 ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com