భారత్- చైనా సరిహద్దుల్లో హైటెన్షన్...
- June 22, 2020
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి బలం చేకూరుస్తూ… రెండు దేశాల బార్డర్స్‌లో పెద్ద ఎత్తున బలగాలు చేరాయి. రెండు వైపులా… వెయ్యి మందికిపైగా బలగాలు మోహరించినట్టు సమాచారం. గల్వాన్లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14, పాంగాంగ్ TSO వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. దీంతో లద్దాఖ్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి.
కీలక ప్రాంతాల్లో భారత్- చైనాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి. జూన్ 15 తర్వాత అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని… అయితే రెండు దేశాల నుంచి ఇటు గల్వాన్, అటు పాంగాంగ్‌లలో బలగాలు మోహరిస్తున్నాయని… ఆర్మీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో… చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్ తనుకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్ TSO నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్ ఆపరేషన్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఫింగర్ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్ అదుపులోనే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆ ప్రాంతంలో చైనా భారీగా ఆర్మీని రంగంలో దించుతుండగా… అదేస్థాయిలో భారత్ తన శిబిరంలోనూ సైనికులను రంగంలో దించుతోంది. అటు వాస్తవాధీన రేఖ వెంట ఇండియన్ ఆర్మీ మరింతగా అలర్ట్ అవుతోంది. LCA వెంట చైనా ఎలాంటి దురాక్రమణలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. 3 వేల 488 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు వెంట.. ప్రత్యేక దళాలను రంగంలో దించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు