షార్జా: 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించిన భారతీయ వ్యాపారవేత్త

- June 23, 2020 , by Maagulf
షార్జా: 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించిన భారతీయ వ్యాపారవేత్త

షార్జా: 25వ అంతస్థు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయిన భారత వ్యాపారి..వివరాల్లోకి వెళ్ళితే..దుబాయ్‌లో నివిసిస్తున్న టి.పి. అజిత్(55) జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలోని టవర్ 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించారు. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

దుబాయ్ లో నివాసముంటున్న అతను షార్జాకు ఎందుకు ప్రయాణించాడో స్పష్టంగా తెలియదని కమ్యూనిటీ వర్గాలు తెలిపాయి. మృతుడు దుబాయ్ నివాసి కావడంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి షార్జా మరియు దుబాయ్ పోలీసులు కలిసి పనిచేయవలసి ఉంటుందని అధికారి తెలిపారు.

30 సంవత్సరాలపాటు యూఏఈ లో నివసిస్తున్న అజిత్ కు గోడౌన్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి. అతనికి ఇతర గల్ఫ్ దేశాలలో వ్యాపార ఉనికి ఉంది. ఆయన ఇటీవల కేరళలోని కన్నూర్‌లో ఒక ఇల్లు నిర్మించారు. ఆయనకు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు వ్యాపారం నడుపుటకు అజిత్ కు సహాయం అందిస్తుండగా కుమార్తె విద్యనభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com