బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మొదటి ఛార్టర్డ్ ఫ్లైట్
- June 24, 2020
మనామా:శంషాబాద్ విమానాశ్రయానికి కరోనా వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థల చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తున్నాయి. మొదటి ఛార్టర్డ్ ఫ్లైట్ బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి చేరుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఇండియన్ క్లబ్ మరియు తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో విమానం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు వచ్చారు.ఈ విమానం ఏర్పాటు చేయటానికి ఇండియన్ ఎంబసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ సాంస్కృతిక సంఘంకి సంబంధించిన వెంకట స్వామి(అధ్యక్షులు), గవ్వల పల్లి(ఉపాధ్యక్షులు), మురళి దాసరి(కార్యదర్శి) సంజీవ్ గాండ్ల, సభ్యులు అల్లే గంగాధర్ పోచయ్య రాజారెడ్డి సుదర్శన్ కిరణ్ బాబురావు, వాలంటీర్లు తదితరులు సహాయ సహకారాలు అందించారు.వచ్చిన ప్రవాసీయులందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు