రెసిడెన్సీ వీసాదారులకు దుబాయ్ కీలక ప్రకటన
- June 24, 2020
దుబాయ్: విదేశాలలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు సోమవారం (జూన్ 22) నుండి తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో వీరి రాకకు వీలుగా యూఏఈ లోని విమానాశ్రయాలు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశాయి అని దుబాయ్ సుప్రీం క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది.
నివాసితులు అనుసరించాల్సిన విధానం మరియు తిరిగి ప్రయాణించడానికి వారు కట్టుబడి ఉండవలసిన పరిస్థితులను జిడిఆర్ఎఫ్ఎ ఇలా పేర్కొంది..
* ప్రయాణించేవారు మొదట ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ నుండి ఈ ఒంక్ ద్వారా smart.gdrfad.gov.ae అనుమతి పొందవలసి ఉంటుంది.
* దరఖాస్తు ఆమోదించబడితే, నివాసితులకు సందేశం అందుతుంది లేదా మరలా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
* అనుమతి/సందేశం పొందిన తర్వాతే నివాసితులు టికెట్లు బుక్ చేసుకోవాలి.
* విమాన టికెట్లు బుక్ చేసుకునే ముందు నివాసితులు దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) నుండి అనుమతి పొందాలి. ఈ లింక్
https://smart.gdrfad.gov.ae/Smart_OTCServicesPortal/ReturnPermitServiceForm.aspx ద్వారా ఆమోదం పొందవచ్చు.
* బుకింగ్ ప్రక్రియలో, మీ GDRFA అప్లికేషన్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి. మీరు ప్రయాణించేటప్పుడు ఆమోదం ఇమెయిల్ కాపీని తప్పక మీవద్ద ఉంచుకోవాలి.
* దుబాయ్ వెళ్లే ప్రతి ప్రయాణీకుడు ఆరోగ్య ప్రకటన ఫారం మరియు క్వారంటైన్ డిక్లరేషన్ ఫారమ్ నింపాలి. ఆ రెండు ఫారమ్‌లను ప్రింట్ చేసుకొని, నింపి, వచ్చినప్పుడు దుబాయ్ హెల్త్ అథారిటీ సిబ్బందికి అప్పగించాలి.
* దుబాయ్లో ల్యాండ్ అయిన వెంటనే Covid-19 DXB యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* దుబాయ్ విమానాశ్రయాలలో పీసీఆర్ టెస్ట్ చేయబడుతుంది. రిజల్ట్ వచ్చేవరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఒకవేళ టెస్టులో పాజిటివ్ అని వస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు