రియాద్:సౌదీ న్యాయశాఖలో 22 మందికి జడ్జీలుగా పదోన్నతులు..
- June 24, 2020
రియాద్:సౌదీలోని న్యాయశాఖలోని 22 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించారు కింగ్ సల్మాన్. ఈ మేరకు వారి నియామక ఆదేశాలకు సంబంధించి డిక్రీ జారీ చేశారు. జ్యూడిషియరీలోని వివిధ విభాగాల్లోని సమర్ధులు, నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి పదోన్నతులు కల్పించినట్లు న్యాయవ్యవస్థ మండలి పరిపాలన విభాగం చైర్మన్ షేక్ ఖలీద్ బిన్ మొహ్మద్ అల్ యూసుఫ్ తెలిపారు. ప్రస్తత ఉత్తర్వులతో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారికి మరింత మెరుగైన సత్వర న్యాయం అందుతుందని అన్నారాయన. అంతేకాదు..సౌదీ న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు. కక్షిదారులకు వీలైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు వీలుగా న్యాయవ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా పూర్తిగా పేపర్ వర్క్ తగ్గిపోయి..ఒకే సారి ఉత్తర్వులను అన్ని శాఖలకు పంపించేందుకు వీలు కలుగుతుందని..దీని ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందని వివరించారు. అంతేకాదు..డాక్యుమెంటేషన్ వర్క్ తగ్గి..ఏడాదికి 8 మిలియన్ల పేపర్లను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!