యూ.ఏ.ఈ:భారత్ కు వెళ్లే చార్టడ్ ఫ్లైట్స్ కొత్త నియమావళి..
- June 24, 2020_1593007614.jpg)
యూ.ఏ.ఈ:లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాసీ భారతీయులను స్వదేశానికి తరలించటంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం చిత్తశుద్ధితో వ్యవహరించిందని భారత దౌత్య కార్యాలయాలు తెలిపాయి. గత మే 7 నుంచి జూన్ 20 నాటికి దాదాపు 60 వేల మందిని ఎయిర్ ఇండియా, ఇతర ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా ప్రవాసీయ భారతీయులను స్వదేశానికి చేరవేసినట్లు వెల్లడించారు. ఇక గత మూడు వారాలుగా ఎన్ఆర్ఐల తరలింపులో మరింత వేగం పుంజుకుందని వివరించారు. ప్రత్యేక నియామవళి రూపొందించుకొని దాదాపు 200 చార్టడ్ విమానాలు ఇండియాకు సర్వీసులు నడిపాయని తెలిపారు. అయితే..జూన్ 25 నుంచి సర్వీసులు అందించనున్న చార్టడ్ ఫ్లైట్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు విధించినట్లు దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. యూఏఈతో పాటు ఇతర దేశాల నుంచి ఇండియాకు వెళ్లే అన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు నియమావళి వర్తిస్తుంది.
భారత ప్రభుత్వం సూచించిన ప్రణాళికబద్ధమైన నియమావళి ప్రకారం ప్రతి విమాన ఆపరేటర్ ముందుగానే తమ ప్రయాణికుల వివరాలతో చార్ట్ ను రూపొందించాలి. ఆ చార్ట్ ను విమాన గమ్యస్థానం ఉండే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతి తీసుకోవాలి. రాయబార, దౌత్య కార్యాలయాలకు సమాచారం అందించి ప్రయాణికుల లిస్ట్ పై తుది జాబితా రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలతో రాయబార, దౌత్య కార్యాలయాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు, దౌత్య, రాయబార కార్యాలయాల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను జత పరుస్తూ డీజీసీఏ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత విమాన ప్రయాణికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ శిబిరాలు(క్వారంటైన్) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే..ఇప్పటికే అనుమతులు పొందిన విమాన సర్వీసులకు ఇవేమి అనుమతులు అవసరం లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?