ఫాస్ట్ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, టొబాకోపై పన్ను
- February 02, 2016
ఒమన్‌లో ఫాస్ట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింగ్స్, టొబాకో ఉత్పత్తులపై త్వరలో పన్నులు విధించనున్నట్లు హెల్త్ మినిస్టర్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైది చెప్పారు. జిసిసి క్యాన్సర్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు హెల్త్ మినిస్టర్. పొగాకు ఉత్పత్తులపై 100 శాతం పన్ను విధించాలని గత నవంబర్‌లో జిసిసి ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇతర దేశాలతో పోల్చితే సిగరెట్ ధరలు ఒమన్‌లో తక్కువ గనుక, ఖచ్చితంగా పన్నులు విధించవలసి ఉంటుందని డాక్టర్ జవాద్ అల్ లవాతి చెప్పారు. 97 శాతం లంగ్ క్యాన్సర్ కేసుల్లో బాధితులు స్మోకర్స్‌గా ఉన్నవారేనని గణాంకాలు చెబుతున్నాయి. ఒమన్‌లో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా లంగ్ క్యాన్సర్ రానున్న ఐదేళ్ళలో మారనుందని రాయల్ హాస్పిటల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ అల్ బహ్రానీ ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్సుమర్ ప్రొటెక్షన్ ఇటీవలే ఎలక్ట్రానిక్ సిగరెట్లను, ఎలక్ట్రానిక్ షిషా (హుక్కా)లనూ బ్యాన్ చేసింది. అమ్మకందారులు ఎక్కడా నిషేధిత ఇ-సిగరెట్లు లేదా ఇ-హుక్కాల అమ్మకాలను జరపరాదనీ, నిబంధనలు ఉల్లంఘిస్తే 500 ఒమన్ రియాల్స్ ఫైన్ తప్పదనే హెచ్చరికలూ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









