పరీక్ష లేకుండానే SBI లో ఉద్యోగం...
- June 25, 2020
భారతీయ స్టేట్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. సంస్థకు సంబంధించిన వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యూమ్ తో పాటు గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరు అభ్యర్ధులకైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







