భారత్‌లో 24గంటల్లో 16,992కేసులు...

- June 25, 2020 , by Maagulf
భారత్‌లో 24గంటల్లో 16,992కేసులు...

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్ లో ఒక్క రోజే 16,992 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే ఈ కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వం సేవలు అందిస్తున్న వారు సైతం ఈ కరోనా వైరస్ భారిన పడుతున్నారు. భారత్ లో తాజాగా నమోదు అయినా పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,73,105 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణం గా భారత్ లో 418 మరణించారు. అయితే ఈ మరణాల్లో వైద్యులు, పోలీసులు కూడా ఉంటున్నారు. ఎక్కువగా కరోనా వైరస్ ను అరికట్టడానికి సేవ చేస్తున్న వారు దీని భారిన పడటం ఎక్కువ వేదన కి గురి చేస్తుంది. అయితే తాజాగా నమోదు అయినా ఈ మరణాలతో భారత్ లో మరణించన వారి సంఖ్య 14,894 కి చేరింది.

భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి, కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,71,697 కి చేరింది. రోజురోజుకీ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే భారత్ లో 1,86,514 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com