పోలీసు వేషధారణలో దోపిడీ.. ఇద్దరి అరెస్ట్‌

- June 25, 2020 , by Maagulf
పోలీసు వేషధారణలో దోపిడీ.. ఇద్దరి అరెస్ట్‌

మనామా:రస్‌ జువైద్‌ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు పోలీసుల్లా వేషధారణతో దోపిడీకి పాల్పడిన ఘటనపై మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ స్పందించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ ఘటనపై విచారణ జరిపినట్లు మినిస్ట్రీ తెలిపింది. 33 ఏళ్ళ వ్యక్తి తన వాహనంలో వెళుతుండగా, నిందితులు అతన్ని దోపిడీ చేశారని, విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారని పేర్కొంది మినిస్ట్రీ. నిందితులు ఈ తరహా ఘటనలకు గతంలోనూ పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com