కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ

- June 25, 2020 , by Maagulf
కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ

ఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ ఎత్తేసిన మరుసటి రోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కేసుల్లో పుట్టిల్లు వుహాన్‌ను దాటేసింది. సరిగ్గా రెండు వారాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని కరోనా వ్యాప్తిలో మించిపోయింది. సోమవారం ఉదయానికి ఢిల్లీలో నమోదైన కరోనా కేసులు 70,390. ఇదే సమయానికి ముంబైలో ఉన్న కేసుల సంఖ్య 69,529. ఢిల్లీ కరోనా హాట్‌స్పాట్‌గా మారిపోయింది. రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల కొరత ఏర్పడటంతో ఢిల్లీ ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రాన్ని కరోనావైరస్ ఐసోలేషన్ సదుపాయంగా మారుస్తోంది. 

ఇందులో 10,000 పడకల వసతి కలదు. ఈ పడకలు కార్డ్బోర్డ్తో తయారు చేయబడ్డాయి తద్వారా వాటిని వాడినతర్వాత పారవేయడం సులభతరం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com