అల్‌ షౌక్‌ ఏరియాలో ఐదు ఇళ్ళల్లో లోకల్‌ లిక్కర్‌ తయారీ

- June 25, 2020 , by Maagulf
అల్‌ షౌక్‌ ఏరియాలో ఐదు ఇళ్ళల్లో లోకల్‌ లిక్కర్‌ తయారీ

కువైట్ సిటీ:జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ సెకక్యూరిటీ మీడియా - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, జిలీబ్‌ అల్‌ షుయోక్‌ ప్రాంతంలోని ఐదు ఇళ్ళలో అక్రమంగా లోకల్‌ లిక్కర్‌ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ తనిఖీల సందర్భంగా పలువురు వ్యక్తులు ఈ ప్రాంతంలో అనుమానిత రీతిలో సంచరిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. వారిని పట్టుకుని విచారించగా, ఆ ప్రాంతంలో ఐదు ఇళ్ళలో లోకల్‌ లిక్కర్‌ని తయారు చేస్తున్న విషయం బయటపడింది. నిందితుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు అధికారులు. సంబంధిత ఇళ్ళను సీజ్‌ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com