కోవిడ్ ఫ్రీగా మారుతున్న అబుధాబి ఆస్పత్రులు..తవమ్ ఆస్పత్రి నుంచి చివరి రోగి డిశ్చార్జ్
- June 27, 2020
అబుధాబి : కరోనా నియంత్రణకు అబుధాబి అధికారులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అబుధాబిలోని కోవిడ్ ఆస్పత్రలన్ని ఒక్కొక్కటిగా కరోనా ఫ్రీ ఆస్పత్రులుగా మారుతున్నాయి. లేటెస్ట్ గా అల్ ఐన్ లోని తవమ్ ఆస్పత్రి కరోనా ఫ్రీ ఆస్పత్రిగా ప్రకటించుకుంది. తమ ఆస్పత్రిలోని చివరి కరోనా పేషెంట్ ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. ఇక నుంచి సాధారణ పేషెంట్లకు చికిత్స ప్రారంభించబోతున్నట్లు కూడా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు అబుధాబిలోని షేక్ షాక్బౌట్ మెడికల్ సిటీ కూడా కరోనా ఫ్రీ ఆస్పత్రిగా ప్రకటించిన విషయం తెలిసింది. అబుధాబిలో కరోనా కట్టడిలో అనుకున్న ఫలితాలు సాధిస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. శానిటైజేషన్ ప్రక్రియలో పాల్గొన్న వారితో పాటు వైద్య సిబ్బంది పట్టుదలతోనే ఈ మేరకు సత్ఫలితాలు సాధించామని ప్రశంసించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!