షార్జా: జులై 1లోపు ఫైన్లు చెల్లించండి..వాహనదారులకు షార్జా అధికారుల సూచన

- June 27, 2020 , by Maagulf
షార్జా: జులై 1లోపు ఫైన్లు చెల్లించండి..వాహనదారులకు షార్జా అధికారుల సూచన

ట్రాఫిక్ జరిమానాలపై ఉన్న మాఫీ అవకాశాన్ని వాహనదారులు, డ్రైవర్లు వినియోగించుకోవాలని మరోసారి గుర్తు చేశారు షార్జా పోలీసులు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి  ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన జరిమానాలను జులై 1లోగా చెల్లిస్తే 50 శాతం ఫైన్ మాఫీ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వాహనాదారులు వినియోగించుకోవాలని తెలిపారు. అంతేకాదు..కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో తమ అధ్వర్యంలోని అద్దె కంపెనీల కిరాయిని కూడా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రవాసీయులు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com