కర్ఫ్యూ తర్వాత తొలిసారిగా పవిత్ర మక్కాలోని మసీదులల్లో ప్రార్ధనలు
- June 27, 2020
సౌదీ: కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత పవిత్ర మక్కాలోని మసీదులలో తొలి సారిగా శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించారు. ఇన్నాళ్లుకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండటంతో మసీదులలో ప్రార్ధనలకు అనుమతి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సౌదీ అరేబియాలో వారం క్రితం కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేశారు. దీంతో కర్ఫ్యూ ఎత్తివేసిన తొలి శుక్రవారం రోజున మసీదులలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే...ప్రార్ధనలకు 20 నిమిషాల ముందు మసీదులను తెరిచి భక్తులకు అనుమతించారు. అదేవిధంగా ప్రార్ధనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మసీదులను మూసివేశారు. అంతేకాకుండా ప్రార్ధన సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్న మార్గనిర్దేశకాల మేరకు వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండి ప్రార్ధనలు నిర్వహించారు. ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు ఎవరి మ్యాట్ లను వారే తెచ్చుకున్నారు. అలాగే కరోనా నియంత్రణలో భాగంగా టాయిలెట్లను మూసివేయటంతో పాటు చిన్నపిల్లలను ప్రార్ధనలకు అనుమతించలేదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







