లివర్ డ్యామెజ్ తో రెండేళ్ల చిన్నారి వ్యధ..ఆర్ధిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

- June 27, 2020 , by Maagulf
లివర్ డ్యామెజ్ తో రెండేళ్ల చిన్నారి వ్యధ..ఆర్ధిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

తెలంగాణ:బుడిబుడి నడకలతో ఆడుకోవాల్సిన వయస్సు అతనిది.పుట్టి రెండేళ్లు నిండకుండానే గుండె తరుక్కుపోయే కష్టాలు ఎదురయ్యాయి. ఆ చిన్నారికి కాలేయ సంబంధిత వ్యాధి రావటంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాబు కేరింతలతో కళకళలాడాల్సిన ఆ తల్లిదండ్రులు..తమ కంటిపాపను రక్షించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఆపరేషన్ కు సరిపయే డబ్బులు లేక..కొడుకును రక్షించుకునేందుకు ప్రతి రోజు గుండెకోత అనుభవిస్తున్నారు. పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు తేజన్స్. కాలేయ సంబంధిత వ్యాధి రావటంతో తేజన్స్ కు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని రెయిన్ బో ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కు 18 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దిగువ మధ్యతరగతికి చెందిన తేజన్స్ తండ్రి లక్ష్మణన్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి. దీంతో తన కుమారుడ్ని రక్షించుకునేందుకు దయగల దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నాడతను. తోచిన సాయం చేసి పుత్రభిక్ష పెట్టాలని తేజన్స్ తండ్రి గొల్లాడ లక్ష్మణ్ మాగల్ఫ్ కు తెలిపాడు.సోషల్ మీడియా ద్వారా ఫండ్ రైజింగ్ కోసం ఆశగా ప్రయత్నిస్తున్నాడు. అతని ఆశను నేరవేర్చి తోచిన సాయం అందించి మనలోనూ మానవత్వం ఉన్న మనషులు ఉన్నారని చాటుకుందాం. కింద సూచించిన లింకుల ద్వారా తేజన్స్ కు తోచిన ఆర్ధిక సాయం అందించవచ్చు.

రెయిన్ బో డాక్టర్లు రాసిన లేఖhttps://milaap.org/fundraisers/support-master-tejans?utm_source=whatsapp&utm_medium=fundraisers-title

పేటిఎం ద్వారా సాయం అందించేందుకు :  http://m.p-y.tm/pay-milaap?comment=originId_185771&amount=2500&amount_editable=1

యూపీఐ ద్వారా చెల్లించేందుకు వివరాలు :  rzpy.givetomlplakshma0006@hdfcbank https://milaap.org/fundraisers/support-master-tejans/upi_deeplink

బ్యాంక్ ఖాతా ద్వారా సాయం చేసేందుకు వివరాలు :
బ్యాంక్ అకౌంట్ నెంబర్: 2223330068280137
ఖతాదారుడి పేరు : Lakshmanan
IFSC కోడ్: RATN0VAAPIS

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com