ఈజిప్టియన్ బెల్లీ డాన్సర్ కు మూడేళ్ళ జైలు శిక్ష
- June 28, 2020
కైరో:టిక్‌టాక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అసభ్య వీడియోలు పోస్ట్ చేస్తున్న బెల్లీ డ్యాన్సర్‌కు ఈజిప్ట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆమె పోస్టులు సంబంధ బాంధవ్యాలకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ మండిపడింది. దీంతో 3 లక్షల ఈజిప్టియన్ పౌండ్ల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్సర్ సామా ఎల్ మాస్రీ(42) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు.
ఆమె సోషల్ మీడియా అకౌంట్లపైనా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం విచారణ చేపట్టిన కోర్టు.. సాంప్రదాయ విధానాలను ఉల్లంఘిస్తూ, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే విధంగా ఆమె పోస్టులు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల పౌండ్ల జరిమానా విధించింది. అయితే ఎవరో తన సమాచారాన్ని దొంగిలించి, కావాలనే తన అకౌంట్ల నుంచి పోస్ట్ చేస్తున్నారని ఆమె వాపోయింది. దీనిపై కోర్టుకెళతానని, న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపింది. కాగా అసభ్య వీడియోలు పోస్ట్ చేసే ఇతర టిక్‌టాక్ అకౌంట్లపైనా చర్యలు తప్పవని ఈజిప్ట్ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?