కువైట్ లో ఘనంగా ప్రారంభమైన పి.వి శతజయంతి ఉత్సవాలు!!!
- June 29, 2020
కువైట్:తెరాస NRI కువైట్ మరియు తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ, అపరచాణిక్యుడు పివి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
మంత్రి KTR ఆదేశాల మేరకు, NRI కో ఆర్డినేటర్, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ మహేష్ బిగాల పిలుపు మేరకు గల్ఫ్ దేశమైన కువైట్ లో పివి శతజయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా పి.వి ని గౌరవించేలా 52 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో TRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, రవి మరియు తెరాస, జాగృతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?