యూఏఈకి తిరిగొచ్చే రెసిడెంట్స్కి కోవిడ్19 నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
- June 29, 2020
యూఏఈ:విదేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్, యూఏఈకి తిరిగొచ్చే క్రమంలో వారి వెంట తప్పనిసరిగా కోవిడ్19 టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. 72 గంటలలోపు తీసుకున్న కోవిడ్ 19 నెగెటివ్ టెస్ట్ సర్టిఫికెట్ వుంటే తప్ప వారిని విమానంలోకి అనుమతించరు. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ, ఫెడరల్ అథారిటీ అండ్ సిటిజన్షిప్ ఫర్ రెసిడెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి యూఏఈ రెసిడెంట్స్ తిరిగి యూఏఈకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు గైడ్లైన్స్ని విడుదల చేశారు. అనుమతి పొందిన టెస్టింగ్ కేంద్రాల నుంచి తీసుకున్న కోవిడ్ 19 నెగెటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటవుతుంది. చెల్లుబాటయ్యే వీసా తప్పనిసరి. అనుమతి పొందిన ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురాని పక్షంలో, యూఏఈలోకి రాగానే వారికి పరీక్షలు నిర్వహిస్తారు. వారికి 14 రోజుల హోం క్వారంటైన్ లేదా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?