డ్రగ్‌ ట్రాఫికర్స్‌ అరెస్ట్‌

డ్రగ్‌ ట్రాఫికర్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పలు నేరాల కింద డ్రగ్‌ ట్రాఫికర్స్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ కంబాటింగ్‌ నార్కటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌, అతి పెద్ద డ్రగ్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ని భగ్నం చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో ఈ స్మగ్లర్స్‌కి సంబంధాలున్నాయని ఆర్‌ఓపీ పేర్కొంది. మనీ లాండరింగ్‌కి కూడా ఈ నిందితులు పాల్పడుతున్నట్లు ఆర్‌ఓపి వివరించింది. ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, 86 కిలోల హాషిష్‌, హెరాయిన్‌, పెద్దమొత్తంలో డబ్బు, బంగారం పలు కమ్యూనికేషన్‌ డివైజెస్‌ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Back to Top