విశాఖలో మళ్లీ గ్యాస్ లీక్ ఘటన
- June 30, 2020
విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో.. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు.
మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







