యూఏఈ వీసాదారులకు అనుమతి..ట్రావెల్ ఎన్వోసీపై ఎంబసీ క్లారిటీ

యూఏఈ వీసాదారులకు అనుమతి..ట్రావెల్ ఎన్వోసీపై ఎంబసీ క్లారిటీ

యూఏఈ:భారత్ నుంచి యూఏఈ వెళ్లాలని అనుకుంటున్న వీసాదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది ఇండియాలోని యూఏఈ రాయబార కార్యాలయం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యూఏఈ ప్రయాణానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తామని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే..నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలంటే యూఏఈ ప్రభుత్వ షరతులకు లోబడి అన్ని నిబంధనలకు ప్రవాసీయులు అర్హులై ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో తీసుకునే నిర్ణయాలను వీసాదారులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని కూడా రాయబారం కార్యాలయం అధికారులు సూచించారు. విమానాశ్రయాలను మూసివేస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వీసాదారుల ప్రయాణాలు ఆధారపడి ఉంటాయని వెల్లడించారు. ఈ విషయంలో ఇతర పురోగతి ఏమైనా ఉంటే..అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ​

Back to Top