కువైట్:ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..

కువైట్:ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..

కువైట్ సిటీ:దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా..విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించింది కువైట్ ప్రభుత్వం. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపాలని మంత్రి మండలి తీర్మానించింది. మొత్తం మూడు దశల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే..ఇతర దేశాల నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఉన్న విమానాశ్రయాలకు మాత్రమే కువైట్ నుంచి సర్వీసులను నడపనున్నారు. తొలి దశలో 30 శాతం విమానాలను పునరుద్ధరిస్తారు. ఆ తర్వాత రెండో దశలో సర్వీసులను 60 శాతానికి పెంచుతారు. ఇక మూడో దశలో మొత్తం సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసువస్తారు. నిజానికి ఈ నెల మొదట్లోనే విమాన సర్వీసులను పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నా..కేబినెట్ నిర్ణయం తర్వాత ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా డీజీసీఏ వెల్లడించింది. 

 

Back to Top