కువైట్:కఠిన నిబంధనల మధ్య షాపింగ్ మాల్స్ ప్రారంభం

- July 01, 2020 , by Maagulf
కువైట్:కఠిన నిబంధనల మధ్య షాపింగ్ మాల్స్ ప్రారంభం

కువైట్ లో కఠిన నింబంధనల మధ్య షాపింగ్ మాల్స్ ప్రారంభం అయ్యాయి. అన్ లాక్ రెండో దశలో భాగంగా తిరిగి సాధారణ జన జీవనం కొనసాగించేందుకు కొన్ని ఆంక్షలను సడలించింది కువైట్. ఇందులో భాగంగానే దాదాపు 3 నెలల తర్వాత షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతిచ్చింది. అయితే..కరోనా కట్టడి చర్యలను షాపింగ్ మాల్స్ నిర్వహకులు ఖచ్చితంగా అమలు చేసేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాల్స్ దగ్గర జనసమూహ నియంత్రణ కేంద్రాలు, అత్యవసర టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మాల్స్ లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాల్స్ లోకి వచ్చే కస్టమర్ల సంఖ్యను లెక్కించేందుకు ఎంట్రెన్స్ దగ్గర ధర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తద్వారా మాల్స్ కెపాసిటిలో 30 శాతానికి మించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలాఉంటే..మాల్స్ లోని ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో పార్సల్స్ మాత్రమే తీసుకెళ్లాలని, అక్కడే తినేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com