మస్కట్:వాహనాల స్మగ్లింగ్, మోసం కేసుల్లో 11 మంది అరెస్ట్
- July 01, 2020
మస్కట్:వాహనాల స్మగ్లింగ్ తో పాటు దొంగ వాహనాలను అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను రాయల్ ఓమన్ పోలీసులు మస్కట్ లో అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 21 దొంగిలించిన వాహనాలను సీజ్ చేశారు. అవన్ని ఇతర సుల్తానేట్ నుంచి చోరీ చేసుకొచ్చిన వాహనాలేనని రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను తీసుకొచ్చి సుల్తానేట్ లోని పౌరులు, ప్రవాసీయులకు అమ్ముతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చౌకగా వస్తున్నాయని దొంగిలించిన వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను కొని చిక్కుల్లో పడొద్దని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన 11 మంది న్యాయ విచారణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







