ధమ్మామ్: వచ్చే నెలలో కింగ్ ఫహ్ద్ కాజ్ వే ప్రారంభించే అవకాశాలు
- July 01, 2020
ధమ్మామ్:దాదాపుగా నాలుగు నెలలుగా మూతపడిన కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై ఎట్టకేలకు వాహనాలను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ, బహ్రెయిన్ ను కలిపే ఈ కీలక కాజ్ వేను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించే యోచనలో ఉంది బహ్రెయిన్ ప్రభుత్వం. కాజ్ వేపై వాహనాలను అనుమతించటం ద్వారా దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. దీనికి సంబంధించి సమావేశమైన బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ..కాజ్ వే రహదారిని జులై 27 నుంచి ప్రారంభించే అవకాశాలపై చర్చించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుకూల వాతావరణం నెలకొల్పేందుకు గల్ఫ్ దేశాల మండలి కూడా దేశాల మధ్య సరిహద్దు రవాణాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ను కలిసే కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై వాహనాలను అనుమతించేందుకు కసరత్తు చేస్తోంది బహ్రెయిన్. తద్వారా బహ్రెయిన్ లో పర్యాటక రంగానికి ఎంతో ఊరట కలగనుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పర్యటకులు, ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చే వారికి కింగ్ ఫహ్ద్ కాజ్ వే ఎంతగానో ఉపకరిస్తుంది. నిజానికి బహ్రెయిన్ లో పర్యటించే వారిలో సౌదీ నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. గతేడాది మొత్తం 11 మిలియన్ల మంది బహ్రెయిన్ లో పర్యటిస్తే అందులో 88 శాతం సౌదీ నుంచి వచ్చిన వారే. కింగ్ ఫహ్ద్ పై వాహనాల అనుమతి బహ్రెయిన్ ఎంత కీలకమైందంటే..ఈ కాజ్ వే పై ప్రతి రోజు దాదాపు 75 వేల మంది ప్రయాణిస్తుంటారు. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని కూడా బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!