భారత్‌లో కలవరపెడుతున్న కరోనా మరణాలు..
- July 01, 2020
భారత దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజు సుమారు 19వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,653 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, మరణాల సంఖ్య కూడా ప్రభుత్వ వర్గాలను కలవరపెడుతోంది. ఒక్కరోజులోనే 507 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 17400కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,85,493 మందికి కరోనా సోకగా.. అందులో 3,47,979మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,20,114 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతీ రోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోవవుతున్నప్పటికీ.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్తా.. ఊరట కల్పిస్తుంది. కరోనా రికవరీ రేటు 59.43శాతం ఉంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







