కరోనా ఎఫెక్ట్:దేశం వదిలి వెళ్లిన లక్ష మంది ప్రవాసీయులు..

- July 02, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:దేశం వదిలి వెళ్లిన లక్ష మంది ప్రవాసీయులు..

కువైట్ సిటీ:కరోనా ప్రభావం తర్వాత కువైట్ నుంచి స్వదేశాలకు వెళ్లిన ప్రవాసీయుల గణాంకాలను విడుదల చేసింది పౌరవిమానయాన సంస్థ-DGCA. ఒక్క జూన్ నెలలోనే దాదాపు లక్ష మంది ప్రవాసీయులు కువైట్ ను వదిలి వెళ్లారని వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 590 విమానాలు ప్రవాసీయులను ప్రపంచంలోని తమ తమ గమ్యస్థానాలకు చేరవేశాయని వెల్లడించింది. డీజీసీఏ విడుదల చేసిన గణాంకాల మేరకు కువైట్ వదిలి వెళ్లిన ప్రవాసీయుల్లో ఈజిప్టియన్లు మొదటి వరుసలో ఉన్నారు. 49,986 మంది జూన్ నెలలో కువైట్ వదిలి స్వదేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానం ప్రవాస భారతీయులదే. 185 విమానాల్లో 30,033 మంది ప్రవాసీయులు  ఇండియా చేరుకున్నారు. 32 ఫ్లైట్స్ లో 6492 మంది ఖతార్ వెళ్లారు. అయితే..ఖతార్ వెళ్లిన వారిలో ఎక్కువ మంది యూరోపియన్, అమెరికన్ జాతీయులే ఉన్నారు. వాళ్లంతా ముందుగా ఖతార్ చేరుకొని అక్కడి నుంచి వారి స్వదేశానికి చేరుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com