చైనా లో మరో వైరస్..భయమేమి లేదంటున్న WHO
- July 02, 2020
బీజింగ్: చైనాలో మరో స్వైన్‌ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్త ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. మరో సంక్షోభం వస్తుందేమోనని ప్రజలు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కొత్త స్వైన్ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకూ ఈ వైరస్‌పై అందుబాటులో ఉన్న సమాచారం విశ్లేషణే తాజా అధ్యయనం. పందుల పెంపకం దారుల్లో ఎంత మంది దీని బారినపడ్డారనే విషయాన్ని కూడా ఆ అధ్యయనం చర్చించింది. అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైక్ రయన్ తెలిపారు. అమెరికా జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చైనాలో కొత్త వైరస్ కళ్లుతెరిచిందనే విశ్లేషణలు ఈ అధ్యయనం ఆధారంగా వెలువడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?