యాంటీ కోవిడ్‌ నిబంధనలు‌ ఉల్లంఘన: పలువురికి జరిమానాలు

- July 02, 2020 , by Maagulf
యాంటీ కోవిడ్‌ నిబంధనలు‌ ఉల్లంఘన: పలువురికి జరిమానాలు

యూఏఈ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరీమానాలు విధించడం జరిగింది. అలాగే వారి పేర్లను, వారి ఫొటోల్ని వెల్లడించారు. 2,000 దిర్హామ్ ల నుంచి 10,000 దిర్హామ్ ల వరకు జరీమానాలు విధించారు. మాస్క్‌లు ధరించకపోవడం, కర్‌ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించడం, పార్టీలు నిర్వహించడం వంటి చర్యలకు ఈ జరీమానాలు విధించడం జరిగింది. హెల్త్‌ అండ్‌ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ ఉపేక్షించే అవకాశమే లేదని చెప్పడం కోసం ఈ నేమ్ అండ్‌ షేమ్ చర్యలు కూడా తీసుకున్నారు. ముగ్గురు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని పబ్లిష్‌ చేశారు. ఓ ఎమిరేటీ అలాగే ఇద్దరు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం జరిగింది. అరబ్‌ జాతీయుడొకరికి 10,000 దిర్హామ్ ల జరీమానా విధించడం జరిగింది. మరో ముగ్గురు అరబ్స్‌కి ఓ ఆసియా జాతీయుడికి 5,000 దిర్హామ్ ల చొప్పున జరీమానా విధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com