ఆ హోటల్ అంతా బంగారమే...చివరికి వాష్ బేసిన్ కూడా! వియత్నాంలో ప్రారంభం
- July 03, 2020
వియత్నాంలో తొలి గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభం అయ్యింది. పైకప్పు, సైడ్ వాల్స్, బాత్రూమ్స్ ఇలా అంతా బంగారు తాపడం ఉండటం ఆ హోటల్ ప్రత్యేకత. వియత్నాం రాజధాని హనోయ్ లో ఈ బంగారం తాపడం హోటల్ ను ఇటీవలె ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత వియత్నాంలో పర్యాటక రంగంలోని పలు హోటల్స్, టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు తమ హోటల్నే ఎంచుకునేలా బంగారు తాపడం అదనపు ఆకర్షణ కానుందని హోవా బిన్హ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వాహకులు వెల్లడించారు. తమ హోటల్ సీలింగ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు అంతా బంగారుమయమే అని గర్వంగా చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు టన్ను బంగారం వినియోగించినట్లు వెల్లడించారు. అంతా 24 క్యారెట్ గోల్డ్ ను ఉపయోగించామన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు