ఇద్దరు కువైటీలకు జైలు

ఇద్దరు కువైటీలకు జైలు

కువైట్‌ సిటీ: హ్యామన్‌ ట్రాఫికింగ్‌ కేసులో బంగ్లాదేశీ ఎంపీతో లింకులున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కువైటీలకు 21 రోజులపాటు జైలుకు పంపుతూ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ నిర్ణయం తీసుకుంది. గత వారంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బంగ్లాదేశీ ఎంపీకి కస్టడీని 21 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలో మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ అధికారి ఒకర్ని అలాగే మాజీ నేషనల్‌ అసెంబ్లీ అభ్యర్థిని కూడా జైలుకు పంపారు. ఈ కేసులో హై ప్రొఫైల్‌ వ్యక్తులకు ప్రమేయం వుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

 

Back to Top