దుబాయ్:185 మంది ప్రవాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త
- July 04, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన చార్టీలు కూడా కట్టుకోలేని దయనీయస్థితిలో ఉన్న 185 భారత ప్రవాసులను తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఈ విమానంలో గర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నారు.ఈ ఛార్టర్డ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే విమానం వెళ్ళడానికి అనుమతించిన భారత కాన్సుల్ జనరల్ విపుల్. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు వర్గీస్ చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా భారత ప్రవాసులు అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?