ఏపీలో కొత్తగా 765 కరోనా కేసులు
- July 04, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 727 ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు 38 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 17,699కు చేరాయి. ప్రస్తుతం 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 8008 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 218కి చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







