మస్కట్:విమానఛార్జీలను పెంచే ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం
- July 04, 2020
మస్కట్:కరోనాతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కుంటున్నా..భవిష్యత్తులో విమాన ప్రయాణికులపై భారం వేసే ప్రసక్తే లేదని ఒమన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు కూడా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని...అందుకే విమాన ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. అయితే..ఎదైనా ఒక గమ్య స్థానానికి ఒకే సంస్థ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉంటే..విమాన ఛార్జీలను పౌర విమానయాన శాఖ నిర్ధారిస్తుందని తెలిపింది. ఇక ఒకే గమ్యస్థానానికి పలువురు ఆపరేటర్లు విమాన సర్వీసులను నడిపిస్తే పోటీ నెలకొంటుదని..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ధారిస్తారని వివరించింది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో భూమార్గం ద్వారాగానీ, ఆకాశమార్గం ద్వారాగానీ సరిహద్దులు దాటి వచ్చే వారిని ప్రొత్సహించేలా లేవని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలాఉంటే..విదేశాల నుంచి ఒమన్ కు వచ్చే వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్యకాలంలో దాదాపు 2,400 విమానాలు నడిపినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఒమన్ చేరుకున్న వారందర్ని కోవిడ్ మార్గదర్శకాల మేరకు నిర్బంధం చేశామని వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?