అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో హాలీవుడ్ ర్యాపర్
- July 05, 2020
అమెరికా:ఇంకా నాలుగు నెలలు ఉండగానే అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ అధ్యక్ష రేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఎన్నికల్లో కొత్త మలుపులు ట్వీస్ట్ తెరపైకి వచ్చింది. ఎన్నికల రేసులోకి కొత్తగా హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ దిగారు. ఈ మేరకు తను ట్వీట్ చేశారు. 'నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. దేవున్మి విశ్వసిస్తూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలను నెరవేర్చుకుందాం' అని రాసుకొచ్చారు. ఆయన డొనాల్డ్ ట్రంప్ కు అభిమాని. 2018లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత కాన్యే తన భార్యతో కలిసి వైట్ హైస్ ను సందర్శించారు. ఈ ఎన్నికల బరిలో కాన్యే దిగడంతో.. ఆయన ట్రంప్, ఓ బిడెన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారు. కాగా.. వెస్ట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే.. తాను సంపూర్ణ మద్ధతు ఇస్తానని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్రిముఖ పోరులో రసవత్తరంగా జరగున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?