ముహర్రఖ్ గవర్నరేట్ లో కార్మికుల నివాస వసతుల పరిశీలనకు విస్తృత తనిఖీలు

ముహర్రఖ్ గవర్నరేట్ లో కార్మికుల నివాస వసతుల పరిశీలనకు విస్తృత తనిఖీలు

బహ్రెయిన్:ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ప్రవాస కార్మికులు ఉంటున్న నివాస గదులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో కార్మికులు ఆరోగ్య సంరక్షణకు ఈ తనిఖీలు చేపడుతున్నారు. గతంలో ఇరుకిరుకు గదుల్లోనే ఎక్కువ మంది కార్మికులకు ఉంచేవారు. అయితే..కరోనా వ్యాప్తితో గదిలో పరిమిత సంఖ్యలోనే కార్మికులకు బస కల్పించాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలోని పాలకులు..కార్మికుల వసతి సౌకర్యాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు శాశ్వత కమిటిని నియమించారు. ఈ కమిటి ఎప్పుటికప్పుడు తనిఖీలు చేపడుతూ కార్మికుల వసతులను పరిశీలిస్తున్నారు. అంతేకాదు..అంతర్గత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన సమయాల్లో కార్మికులకు అహారంతో పాటు అత్యవసర వస్తువులను అందిస్తున్నారు. రాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా ధృక్పథంతో కార్మికులు సాయం అందిస్తున్నట్లు కమిటి సభ్యులు వివరించారు. 

Back to Top