తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
- July 05, 2020
న్యూ ఢిల్లీ:సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ యాప్‌ల రూపకల్పన ఊపందుకుంది. తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.ఎలిమెంట్స్ యాప్‌ను విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు.. విదేశీ యాప్‌లకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దేశీయ యాప్‌లు మరిన్ని రావాలని ఆయన అన్నారు. గురు పౌర్ణమి రోజున యాప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?