తెలంగాణ:కొత్తగా 1590 కరోనా కేసులు

తెలంగాణ:కొత్తగా 1590 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1590 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 23902కు చేరింది. ఇందులో 10904 యాక్టివ్‌ కేసులు ఉండగా, 12703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం కరోనాతో మరో ఏడుగురు చనిపోగా, ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 295కి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు నమోదైనా కరోనా కేసుల్లో GHMC పరిధిలో 1277 ఉన్నాయి.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Back to Top