TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్
- July 06, 2020కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న TV కళాకారులు 2 వేల మందికి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు TV ప్రొడ్యూసర్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. కరోనా నేపధ్యంలో షూటింగ్ ల సమయంలో భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలకు పెను సవాల్ గా మారిందని, స్వయంనియంత్రణ తోనే నిర్మూలన సాధ్యమని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెసిడెంట్ ప్రసాద్, వినోద్ బాల, ప్రభాకర్, వెంకటేశ్వర్ రావు, DY. చౌదరి, కిరణ్, అశోక్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?