CDA:పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం దుబాయ్‌లో ప్రత్యేక హాట్‌లైన్
- July 06, 2020
దుబాయ్:800988 నెంబర్‌ని డయల్ చేయడం ద్వారా దుబాయ్‌లోని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఎలాంటి ఫిర్యాదుని అయినా చేయొచ్చు. వీడియో కాల్ ద్వారా అవసరమైన సమాచారాన్ని అందుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ని రూపొందించారు. CDA SANNAD Relay పేరుతో రూపొందించిన ఈ యాప్, సైన్ లాంగ్వేజ్‌ని టెక్స్‌ట్‌గా మార్చుతుంది. ఇది వినికిడి లోపం వున్నవారికి, మాట్లాడేలేనివారికి కూడా ఉపయుక్తంగా వుంటుంది. జనద్ రిలే అలాగే కాల్ సెంటర్ 800988 అన్ని సమయాల్లోనూ అందుబాటులో వుంటుందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకోగానే సీడీఏ, ఆ కేసుని పరిశీలిస్తుందనీ, అవసరమైతే సంబంధిత అథారిటీస్‌తో కలిసి యాక్షన్ ప్లాన్‌ని సిద్ధం చేస్తాయని CDA డెవలప్‌మెంట్ మరియు సోషల్ కేర్ సెక్టార్ సీఈఓ హురైజ్ ఎ ముర్ బిన్ హురైజ్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







