తెలంగాణలో 11 కరోనా మరణాలు
- July 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారంగా ఈ సంఖ్య మరింత తీవ్రమైంది.సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదు కాగా 11 మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 25,733 మంది కరోనా బారిన పడ్డారు.మొత్తం 306 మంది చనిపోయారు.ఇంకా 10,646 కేసులు యాక్టివ్ ఉన్నాయి.కరోనా సోకి చికిత్స పొంది తాజాగా 2,078 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 14,781 మంది డిశ్చార్జి అయ్యారు.
GHMC పరిధిలోనే 1,419 మందికి పాజిటివ్ రాగా రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, సంగారెడ్డిలో 3, కరీంనగర్‌లో 5,మహబూబ్ నగర్‌లో 9, గద్వాల్‌లో 1, నల్గొండలో 9, వరంగల్ అర్బన్‌లో 9, నిజామాబాద్ లో 9, వికారాబాద్‌లో 7,మెదక్‌లో 20, నారాయణపేట్‌లో 1, పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 20, జగిత్యాలలో 4, మహబూబాబాద్‌లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లండించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







