ఏపీలో కొత్తగా 1155 కరోనా కేసులు..
- July 07, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1155 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,197కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 762 మంది డిశ్చార్జ్ కాగా, 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి రాష్ట్రంలో 252 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







