కర్ఫ్యూ నుంచి మినహాయింపునకు ఆస్పత్రి వెళ్లిన ఆధారాలు తప్పనిసరి చేసిన కువైట్
- July 08, 2020
కువైట్ సిటీ:ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కర్ఫ్యూ సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రకటించింది కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ. కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందెందుకు వారు వెళ్తున్న ఆస్పత్రి, హెల్త్ సెంటర్ వివరాలను తప్పనిసరిగా తమ దరఖాస్తులో తెలుపాల్సి ఉంటుంది. దరఖాస్తుల కోసం మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. https://curfew.paci.gov.kw ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు..అనుమతి పొందిన వ్యక్తులు...తాము ఆస్పత్రి, హెల్త్ సెంటర్ లో విజిట్ చేసిన తర్వాత చికిత్స వివరాలను కూడా వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. ఇలా అప్ డేట్ చేయటం ద్వారా భవిష్యత్తులో కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లిన వివరాలను నమోదు చేయకుంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు రద్దు అవుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







